Saturday, March 12, 2011
జై సమైక్యాంధ్ర
తెలుగుజాతి ఎంతో క్లిష్టమైన సమస్యను ఎదురుకుంటుంది. ఒకనాడు భాష ప్రాతిపదిక మీద రాష్ట్రాలను ఏర్పాటు చెయ్యడానికి తెలుగుజాతి కారణమైంది. అది దేశానికి ఎంత మేలు చేసిందో చెప్పనకరలేదు. ఈరోజు రాక్షస శక్తులు మన రాష్ట్రాన్ని ముక్కలుగా చేసి, ప్రజలను విడతీసి, తెలుగుజాతిని మల్లి చీకటి యుగాలలోకి తోసేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది తెలుగుజాతికి ఒక పరిక్ష. విద్రోహ శక్తులను దైర్యంగా ఎదురుకుని, సమైక్యంగా ఉందామని కటినమైన నిర్ణయం తీసుకుంటే మనజాతికి భవిషత్తు వుంటుంది. ఈ ఒక్కసారి మనం ఎంత కష్టంలోనైనా కటినమైన నిర్ణయం తీసుకోగలము అని నిరుపించగాలిగితే, మనకు వున్నా వేరే సమస్యలన్నిటిని అదే విదంగా ఎదురుకోగలుగుతాం. లేకపోతె ఎవడు మందిని పోగుచేయ్యగాలిగితే వాడిదే రాజ్యం.
Tuesday, March 08, 2011
ఫిలోసోఫి
ఎన్నో రోజుల తరవాత మల్లి బ్లాగ్గింగ్ మోదులుపెట్టాను. నిజం చెప్పాలంటే రాయడానికి సంతోష కరమైన ఆలోచనలు ఏమీలేవు. ప్రపంచంలో జరుగుతున్న అరాచకం, అవినీతి, అన్యాయం, తగ్గిపోతున్న విలువలు చూస్తుంటే ఎంతో బాదగా వుంది. ఈలోకం ఎక్కడికి వెళ్తుంది, అమాయక ప్రజలు ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి, అసలు దేవుడికి పిచ్చిగానీ పట్టిందా ననిపిన్స్తుంది.
ఈ లోకంలో అన్నాయం గురించి దేవుణ్ణి ప్రేస్నించినప్పుడు ఒక ఆలోచన కలుగుతుంది. నిజానికి దేవుడు నాకు మచి జీవితం ఇచ్చాడు. మంచి కుటుంబం, వుద్యోగం, ఆరోగ్యం అన్ని ఇచ్చాడు. మరి దేవుడు తన మిగితా శ్రుస్టితో ఏమిచేస్తాడో తన ఇష్టం కాదా. నాకు దాని గురించి అడిగే అధికారం వుందా? నాకేమైనా లోటు జరిగితే అడగాలికనే, అన్ని ఇచ్చినప్పుడు గూడా దేవుడిని ఎందుకు ప్రస్నించాలి అని అనిపిస్తుంది. అది ఫిలోసోఫి. దానికి సమాదానం వుండదు.
Subscribe to:
Posts (Atom)