Another master peice. If you know who the lyricist is, please tell me.
ఆకాశ దేశాన, ఆషాడ మాసాన మెరిసేటి ఓ మేఘమా... మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో వీడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం
వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై, వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
ఈ యడరి దారులలో యడద నేను పరిచానని, కడిమియోలె నిలిచానని
ఉరమని తరమని వుసులతో ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి విన్న వేదన, నా విరహ వేదన
ఆకాశ దేశాన, ఆషాడ మాసాన మెరిసేటి ఓ మేఘమా... మెరిసేటి ఓ మేఘమా
రాలు పూల తేనియకై రాతి పూల తుమ్మెదనై, రాలు పూల తేనియకై రాతి పూల తుమ్మెదనై
ఈ నిశిది నీడలలో నివురులాగ మిగిలానని, శిధిల జివినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో రుదిరబాష్ప జల దారాలతో....
విన్నవించు నా చెలికి మనొ వేదన, నా మరణ యాతన
ఆకాశ దేశాన, ఆషాడ మాసాన మెరిసేటి ఓ మేఘమా... మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో వీడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం
2 comments:
thanks for remembering one of my fav songs
inka evaru veturi garu...ee film lo aakulo akunai and mundutelisina by devulapalli gaaru and others by veturi garu
Post a Comment